News March 28, 2024

NLG: మాస్టర్ ప్లాన్.. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే!

image

NLG మున్సిపాలిటీలో 40 ఏళ్ల కిందటి మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంది. పాత మాస్టర్ ప్లాన్ వల్ల మున్సిపాలిటీ ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ కోసం చేస్తున్న కసరత్తు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. పాలకవర్గాలు, ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారే గాని మాస్టర్ ప్లాన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 10, 2026

నల్గొండ: పుర పోరులో.. పెరిగిన ఓటు విలువ!

image

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో తాయిలాల పంపిణీకి తెరలేచింది. అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో రూ.లక్షలు కుమ్మరిస్తుండడంతో ఓటు విలువ పెరిగింది. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, హాలియా, చండూర్, దేవరకొండ, చిట్యాల, నందికొండ మున్సిపాల్టీల్లో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండలో ఒక్కో డివిజన్‌లో రూ.50 లక్షల పైగానే డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

News February 10, 2026

ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన నాకాబందీ చేపట్టారు. 48 గంటల ‘మౌన కాలం’ అమల్లోకి రావడంతో ప్రచారాలు, సభలపై నిషేధం విధించారు. సెక్షన్ 163 అమలు చేస్తూ అక్రమ నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

News February 9, 2026

NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

image

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.