News August 21, 2025
NLG: ముదస్తుగానే వైన్స్ టెండర్లు..!

కొత్త వైన్స్‌కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది NOV 30తో ముగియనున్న నేపథ్యంలో ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 DEC 1 నుంచి 2027 NOV 30 వరకు కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. మద్యం టెండర్ ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 155 వైన్స్‌లు ఉన్నాయి.
Similar News
News January 22, 2026
నల్గొండలో మొదలైన రాజకీయ సెగలు

నల్గొండలో మున్సిపల్ పోరుకు ముందే రాజకీయ క్షేత్రం రగులుతోంది. అధికార ‘హస్తం’లో ఆశావహుల తాకిడి పెరగడంతో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రెబల్స్ భయం నేతలకు గుబులు పుట్టిస్తోంది. అటు ‘గులాబీ’ దళాన్ని వలసలు వేధిస్తుంటే, ‘కమలం’లో అంతర్గత విభేదాలు శాపంగా మారాయి. స్వతంత్రుల వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో చూడాలి. ఓటరు నాడి ఎటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
News January 22, 2026
NLG: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కేతెపల్లి మండలంలోని కొర్లపాడు సమీపంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం పాదచారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చిత్రంలోని వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కేతపల్లి ఎస్సై (ఫోన్: 8712670180)కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
News January 22, 2026
యాసంగి సీజన్లో జోరుగా వరి నాట్లు

జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 4 లక్షల 24వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. మరో లక్ష ఎకరాలకు సరిపడా వరి నార్లు సిద్ధం చేసుకున్నారు. ఈ సీజన్లో మొత్తం 6,57,000 ఎకరాల్లో వరి తదితర పంటలు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ప్రస్తుతం యాసంగి సీజన్లో రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు ఎక్కువగా వెదజల్లే పద్ధతిని పాటించారు.


