News November 5, 2025

NLG: మూడేళ్లలో ఆరుసార్లు పంట నష్టం!

image

ఉమ్మడి జిల్లాలో రైతులను ప్రకృతి వెంటాడుతుంది. 2023 నుంచి ఇప్పటివరకు అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా ఆరుసార్లు రైతులు పంట నష్టపోయారు. అయితే కేవలం రెండుసార్లు జరిగిన నష్టానికి మాత్రమే పరిహారం చెల్లించినట్లు రైతులు వాపోతున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.30 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. కానీ రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 25, 2026

ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్

image

WPL-2026లో ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేసింది. ఇవాళ జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు విఫలమైనా లారా(42*), రోడ్రిగ్స్(24), కాప్(19*) రాణించడంతో విజయం సొంతమైంది. ఈ గెలుపుతో DC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో ఆర్సీబీ(10P) ఉంది.

News January 25, 2026

ఆకర్షణీయంగా ముస్తాబైన తిరుపతి కలెక్టరేట్

image

గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకల సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ త్రివర్ణ విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. రాత్రి వేళల్లో కలెక్టరేట్ భవనం నలువైపులా ఈ మూడు రంగుల విద్యుత్ దీపాలతో కాంతులు విరజిమ్ముతూ అత్యంత సుందరంగా, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.

News January 25, 2026

NZB: మున్సిపల్ ఎన్నికల BRS ఇన్‌ఛార్జీలు వీరే..

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని కీలక ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి అప్పగించారు. బోధన్ మున్సిపాలిటీకి దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్‌కు చెరుమల్ల రాకేష్, బాల్కొండకు సుమనా రెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా వీరు పనిచేయనున్నారు.