News September 13, 2025
NLG: రజాకార్ల మారణకాండకు 79 ఏళ్లు

రజాకారులు సృష్టించిన మారణ హోమానికి సజీవ సాక్ష్యం వల్లాల గ్రామం. 1948 ఆగస్టు15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తుండగా గ్రామంపై దండెత్తిన రజాకారులు అమానుష హత్యాకాండకు తెగబడ్డారు. పాఠశాల ప్రాంగణంలోనే పది మందిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనకు 79 ఏళ్లు నిండాయి.
Similar News
News December 12, 2025
TU: ఈ నెల 24వ తేదీలోపు పరీక్షల ఫీజు చెల్లించాలి: COE

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని చదువుతున్న పీజీ M.A/MSW/M.Sc/M.Com/MBA/MCA 3వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH) 3, 5 సెమిస్టర్ల ఇంటిగ్రేటెడ్ PG(IMBA) 3, 5, 9 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
News December 12, 2025
నేను, గిల్ అలా చేసి ఉండాల్సింది: సూర్య

ఛేజింగ్‌లో తాను, గిల్ మంచి స్టార్ట్ ఇవ్వాల్సిందని SAతో 2వ T20లో ఓటమి తర్వాత IND కెప్టెన్ సూర్య అన్నారు. ప్రతిసారి అభిషేక్ మీద ఆధారపడలేమని, అతని ఆఫ్ డే అయినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని చెప్పారు. తనతో పాటు గిల్, మిగతా బ్యాటర్లు ఇది అర్థం చేసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. తానైనా బాధ్యత తీసుకొని మరింత సేపు బ్యాటింగ్ చేయాల్సిందని చెప్పారు. తొలి టీ20లోనూ గిల్, SKY పేలవ ప్రదర్శన కనబరిచారు.
News December 12, 2025
TU: ఈ నెల 22లోపు LLB, LLM పరీక్షా ఫీజు చెల్లించాలి: COE

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని చదువుతున్న LLB 1, 3, 5 సెమిస్టర్ల, LLM 1, 3 సెమిస్టర్ల రెగ్యులర్ (థియరీ&ప్రాక్టికల్) పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ లోపు విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.


