News April 24, 2025

NLG: రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఎంపికైన వారి వివరాలు ఈ నెల 28న ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్యను, సెల్ నంబర్ 79955 67558ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 10, 2026

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ఈ ప్రణాళికను రూపొందించామని, దీని విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

News March 10, 2026

నల్గొండ: నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు

image

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు సాగనున్నాయి. మొత్తం 6 పరీక్షలే ఉన్నప్పటికీ, ప్రతి పేపర్‌కు మధ్య 4 నుంచి 6 రోజుల విరామం ఉండటంతో ఏప్రిల్ మధ్య వరకు షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేందుకు SSC బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పరీక్షలు త్వరగా ముగిసేవి, కానీ ఈసారి ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం లభించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 10, 2026

నల్గొండ: బర్డ్ ఫ్లూ భయం.. అధికారి క్లారిటీ

image

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. జిల్లాలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, ఎక్కడా చనిపోయినట్లు ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.