News April 26, 2024

NLG: రోడ్డు ప్రమాదంలో మృత్యుంజయులు కార్తీక్, కౌశిక్

image

సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో గురువారం జరిగిన రోడ్డు <<13120144>>ప్రమాదంలో <<>>తల్లిదండ్రులతో పాటు, నాయనమ్మ, తాతయ్యని కోల్పోయి కార్తీక్, కౌశిక్‌లు అనాథలుగా మారారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా, ఇద్దరు అన్నదమ్ములు స్వల్ప గాయాలతో మృత్యుంజయులుగా బయటపడ్డారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 

Similar News

News April 19, 2026

నల్గొండలో 21న మినీ జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 21న నల్గొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో (ఐటిఐ క్యాంపస్) ‘మినీ జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్. పద్మ తెలిపారు. ఈ మేళాకు SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన 18-30 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఎంపికైన వారికి హైదరాబాద్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు వేతనం ఉంటుందని తెలిపారు.

News April 18, 2026

NLG: 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 60,221 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 168 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం సేకరించారు. ఈ ప్రక్రియ ద్వారా 7,077 మంది రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 444 కొనుగోలు కేంద్రాలకు గాను, ప్రస్తుతం 373 కేంద్రాలు పనిచేస్తున్నాయి.