News April 24, 2025
NLG: వడదెబ్బకు పిట్టల్లా

భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఉపాధి కూలీ కొడారు కోటయ్య (62) మృతి చెందారు. ఇటీవల పానగల్‌కు చెందిన కస్పరాలు కనకయ్య, కేతేపల్లి మండలం తుంగతుర్తి వాసి గుంటి వెంకటరమణ వడదెబ్బతో మృతిచెందారు. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News March 14, 2026
సామాన్యుడికి చికెన్ ‘షాక్’.. కిలో స్కిన్ లెస్ రూ.330

వేసవి ఎండల ప్రభావం, కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రంజాన్ మాసం, ఇటు ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడంతో నాన్‌వెజ్ ప్రియులు చికెన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. NLG మార్కెట్‌లో లైవ్ కోడి KG రూ.192, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.300, స్కిన్ లెస్ కిలో రూ.330లకు విక్రయిస్తున్నారు.
News March 14, 2026
NLG: తెల్లవారుజామున వాహనం ఢీకొని మహిళ మృతి

తిప్పర్తిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్‌పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2026
మిర్యాలగూడ: వాగులో పడి రైతు మృతి

మిర్యాలగూడ మండలం తడకమళ్లకి చెందిన అనంతుల లింగయ్య పొలానికి వెళ్లే సమయంలో పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా వాగులో మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.


