News August 20, 2025
NLG: వివాదాల సుడిగుండంలో పంచాయతీ కార్యదర్శులు..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో <<17460094>>పంచాయతీ కార్యదర్శుల<<>> వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే కొంతమంది కార్యదర్శులు విధులకు హాజరుకాకుండానే ఫేక్ అటెండెన్స్ వివాదంలో ఇరుక్కున్నారు. మరోవైపు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తుండడం దుమారం రేపుతుంది. ఇప్పటికే జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శిని SRPT కలెక్టర్ సస్పెండ్ చేశారు. వెలుగులోకి రాని ఘటనలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతి అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు

AP: గోదావరి జిల్లాలను మరిపించేలా ఈసారి తెనాలి వాసులు అల్లుడికి 158 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. తెనాలికి చెందిన మురళీకృష్ణ తన కుమార్తె మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు చేశారు. రకరకాల పిండి వంటలు, ఫలహారాలు, పండ్లతో భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు.
News January 15, 2026
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల, వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఓవైపు గత వారం రోజులు చలి తీవ్రంగా ఉండి ఒక్కసారిగా తగ్గింది. ఉన్నట్టుండి నిన్న పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదయింది. పిట్లం 13మి.మీ, మాచాపూర్ 2.5, మాక్దూంపూర్ 1.5, జుక్కల్ 1.3, నాగిరెడ్డిపేట 1, సోమూర్, బిచ్కుంద 0.5మి.మీ లుగా నమోదు కాగా, ఆయా ప్రాంతాల్లో 16°C, ఆపైన సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు.
News January 15, 2026
తగ్గిన బంగారం ధర.. మరోసారి పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై రూ.15,000 పెరగగా, ఈరోజు రూ.3,000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో 18,000 ఎగబాకి రూ.3,10,000 చేరింది.


