News April 30, 2024

NLG: వీరు ఎవరి ఓట్లను చీల్చుతారో..!

image

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. రెండు స్థానాల్లోనూ భారీగా స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉండటంతో వీరు ఎవరి ఓట్లను చీల్చుతారనే కంగారు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మొదలైంది. నల్లగొండలో రెండు ఈవీఎంలు, భువనగిరిలో మూడు ఈవీఎంలు ఏర్పాటు కానుండడంతో వృద్ధులు, నిరక్షరాస్యుల ఓట్లు ఎవరికి పడతాయోనని ఆందోళన నెలకొంది.

Similar News

News December 14, 2025

నల్గొండలో ప్రశాంతంగా పోలింగ్: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్
తెలిపారు. ఆయన జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా 144 సెక్షన్ (163 బీఎన్ఎస్ఎస్) అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 14, 2025

నల్గొండ: ‘గెలుపే లక్ష్యం.. ప్రలోభాల పర్వం’

image

జిల్లాలో మొదటి విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, రెండో విడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా మిర్యాలగూడ నియోజకవర్గ సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. 10 మండలాల్లోని అభ్యర్థులు వ్యూహాలు రచిస్తూ, పోలింగ్‌కు ముందురోజు రాత్రి నుంచి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారని ప్రజలు అంటున్నారు. ప్రజాస్వామ్య పండగగా ఉండాల్సిన ఎన్నికలు డబ్బు, గిఫ్టుల పోటీగా మార్చేశారని ఆరోపిస్తున్నారు.

News December 13, 2025

చిన్నకాపర్తిలో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదు: కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డ్రైనేజీలో ఓట్లు దొరికిన ఘటనపై ఎలాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లు బయటపడగానే ఆర్డీఓ అశోక్ రెడ్డిని పంపి విచారణ జరిపించామన్నారు. పోలైన ఓట్లు, కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లు, డ్రైనేజీలో దొరికిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయని కలెక్టర్ తెలిపారు.