News August 21, 2025
NLG: వేడుక.. కావొద్దు విషాదం

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక, దుర్గామాత నవరాత్రి వేడుకల సందర్భంగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు ప్రజలను కోరుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున, మండపాల ఏర్పాటు, విగ్రహాల తరలింపు, ఉత్సవ సభలు, రోడ్లపై అలంకరణలు వంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు.
Similar News
News January 24, 2026
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ(BA, B.Com, BSc, BSW), MA, MSW, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్/ప్రజెంటేషన్(ఫ్యాకల్టీ), ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in
News January 24, 2026
మనాలిపై మంచు దుప్పటి..

హిమాచల్‌ప్రదేశ్ మనాలిలో మంచు దట్టంగా కురుస్తోంది. మంచు తీవ్రతకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతకు ప్రజలు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా మంచు కురుస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 3రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. SAT రాత్రి టెంపరేచర్లు ‘-3’ డిగ్రీలుగా నమోదుకావొచ్చని, 10-15KMల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.
News January 24, 2026
కామారెడ్డి: 28న 50 మంది విద్యార్థులకు శ్రీహరికోట పర్యటన

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గత ఏడాది OCTలో నిర్వహించిన ఎంపిక పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన 50 మంది పదో తరగతి విద్యార్థినులతో పాటు 30 మంది టీచర్లను ఈనెల 28న నెల్లూరు(D) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ పర్యటనకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.


