News June 19, 2024
NLG: సెల్ ఫోన్ రిపేర్, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 10వ తరగతి పాసైన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ పురుషులకు సెల్ ఫోన్ రిపేర్, సర్వీసింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందని, ఉమ్మడి నల్గొండకి చెందిన 19 సం. నుంచి 45 లోపు వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు జూన్ 24 లోపు సంస్థ ఆఫీసులో లేదా 9701009265 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 18, 2026
రద్దీ దృష్ట్యా రహదారులపై నిఘా: ఎస్పీ

సంక్రాంతి సెలవుల ముగింపుతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల కోసం జిల్లా పోలీసులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. 450 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. టోల్ ప్లాజాలు, కూడళ్ల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచామని, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని కోరారు.
News January 18, 2026
NLG: మేయర్ పీఠంపై మూడు పార్టీల గురి!

NLG కార్పొరేషన్ మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారనుంది. దీంతో అధికార పార్టీతో పాటు అటు BRS, ఇటు BJPలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 33వ వార్డు నుంచి మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య, BRS మాజీ ఛైర్మన్ సైదిరెడ్డి ఆయన భార్యను పోటీలో నిలుపుతుండగా, BJP నుంచి పిల్లి రామరాజు భార్య సత్యవతి 8వ వార్డు నుంచి పోటీ చేయనున్నారు.
News January 18, 2026
NLG: మారిన రిజర్వేషన్లు.. డివిజన్ల కోసం సెర్చింగ్!

NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్‌లు మారిపోయాయి. తాము పోటీచేసిన స్థానంలో అనుకూలమైన రిజర్వేషన్ కాకుండా మహిళలకు వచ్చిన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోట్ల తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు. NLG కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ గతంలో పోటీ చేసి గెలిచిన స్థానాల్లో ఈ సారి రిజర్వేషన్లు మారిపోయాయి. దీంతో తమకు అనుకూలమైన డివిజన్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


