News January 22, 2025
NLG: స్కాలర్ షిప్ దరఖాస్తులకు మరో ఛాన్స్

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ల కొరకు ఈపాస్ అన్లైన్‌లో ఇంకనూ ధరఖాస్తు చేయని బీసీ, EBC విద్యార్ధులు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ ఒక ప్రకటనలో కోరారు. ఈపాస్ వెబ్సైట్ ద్వారా తమ కళాశాల విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 18, 2025
KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
News February 18, 2025
NLG: హత్య కేసులో 17మందికి జీవిత ఖైదు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకేసు విషయంలో 17 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి రోజా రమణి శిక్షను ఖరారు చేస్తూ మంగళవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులు ఉండగా అందులో ఒకరు ఇప్పటికే మరణించారు. అడ్డగూడూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన విషయంలో వీరికి జీవిత ఖైదు శిక్ష పడింది.
News February 18, 2025
నల్గొండ: వేసవికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నీటి సరఫరా విభాగంపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మంచి నీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.