News August 22, 2025

NLG: హెచ్ఎంలుగా 52 మంది స్కూల్ అసిస్టెంట్లు..!

image

ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లకు సీనియార్టీ ప్రాతిపదికన హెడ్ మాస్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ పదోన్నతుల ఉత్తర్వులు గురువారం రాత్రి విడుదల చేశారు. పదోన్నతుల ప్రక్రియ గతనెలలోనే నిర్వహించారు. అయితే.. కోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జిల్లాలో 52 పోస్టులను పదోన్నతులతో నింపారు.

Similar News

News January 20, 2026

నల్గొండ: రోడ్డు భద్రతే లక్ష్యం-‘అరైవ్ అలైవ్ 2026’ ప్రారంభం

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్ 2026” అవగాహన సదస్సును ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. గతేడాది జిల్లాలో 950 ప్రమాదాలు జరగ్గా, 360 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వాహనదారులు, యువత పాల్గొన్నారు.

News January 20, 2026

NLG: చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు

image

నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 52 రోజులకు గాను గట్టుపైన రూ.28,98,762, గట్టు కింద అమ్మవారి ఆలయంలో రూ.3,85,695, (మొత్తం రూ.32 లక్షల 84 వేల 457) ఆదాయం వచ్చింది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఈవో ఎస్ మోహన్ బాబు, దేవాదాయశాఖ పరిశీలకులు సుమతి పాల్గొన్నారు.

News January 20, 2026

నల్గొండ: క్రీడాకారిణికి కలెక్టర్ ఆర్థిక సాయం

image

రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సపావత్ రమ్యకు జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు ఆదేశాల మేరకు డీవైఎస్ఓ అక్బర్ అలీ రూ.15,000 చెక్కును అందజేశారు. జనవరి 23 నుంచి కోల్‌కతాలో జరిగే జాతీయ పోటీల్లో రమ్య పాల్గొననుంది. ఈ సందర్భంగా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.