News December 4, 2025

NLG: ఏకగ్రీవ గ్రామాల్లోనూ నియమావళి అమలు: SEC

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాల్లో కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్లు, పరిశీలకులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోస్టల్ బ్యాలెట్, ఓటర్ స్లిప్పుల పంపిణీపై సమీక్షించారు. ఫారం-10 ప్రకారం ఫలితాల ప్రకటన, ఉపసర్పంచ్ ఎన్నిక నిబంధనల ప్రకారం జరగాలన్నారు.

Similar News

News December 7, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

News December 7, 2025

కోర్ సబ్జెక్ట్ లేదని అనర్హులుగా ప్రకటించలేం: సుప్రీం

image

అభ్యర్థి PGలో కోర్ సబ్జెక్ట్ లేదని అతడిని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో మానిటరింగ్, ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్‌గా ఓ అభ్యర్థి(M.Com) ఎంపికయ్యారు. కానీ స్టాటిస్టిక్స్‌లో PG లేదని అతడిని ప్రభుత్వం తొలగించింది. దీంతో బాధితుడు SCని ఆశ్రయించారు. జాబ్‌కు కావాల్సిన ప్రధాన సబ్జెక్టు అభ్యర్థి చదివాడని, అతడి PG వేరే స్పెషలైజేషన్‌లో ఉందని తిరస్కరించలేమని SC స్పష్టం చేసింది.

News December 7, 2025

స్పీకర్‌కు హరీశ్‌ రావు బహిరంగ లేఖ

image

శాసన సభ నిబంధనలను పాటించకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖలో విమర్శించారు. రెండేళ్లయినా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని నిర్లక్ష్యం చేయడం, ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని హరీశ్ పేర్కొన్నారు.