News September 10, 2025

NLG: 15 వరకు ఇగ్నో ప్రవేశాల గడువు

image

IGNOUలో జూలై-2025 సెషన్‌కు సంబంధించిన ప్రవేశాలకు చివరితేదీ ఈ నెల 15 వరకు ఉందని ఇగ్నో HYD ప్రాంతీయ కేంద్రం డీడీ డా.రాజు బొల్లా తెలిపారు. మాస్టర్, డిగ్రీ, పీజీడిప్లొమా, డిప్లొమా వంటి వివిధ ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 12, 2025

NLG: స్టేజ్- 2 ఆర్ఓ సస్పెండ్: కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్- 2 ఆర్‌వో‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

News December 12, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

నార్కట్ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్ఐ
నల్గొండ: జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం
నల్గొండ: సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నకిరేకల్: అటవీశాఖ అధికారులకు గుడ్లగూబ అప్పగింత
చండూరు: కస్తాలలో సిపిఐ బలపరిచిన అభ్యర్థి గెలుపు
కట్టంగూర్: వార్షిక వేడుకలకు నిష్కలంక మాత ఆలయం సిద్ధం
శాలిగౌరారం: 22 ఏళ్లకే ఉపసర్పంచిగా ఎన్నిక
నిడమనూరు: విధులు బహిష్కరించిన న్యాయవాదులు

News December 12, 2025

నాకు ఆ విషయం తెలియదు: మంత్రి కోమటిరెడ్డి

image

సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “టికెట్ల ధర పెంచబోమని అసెంబ్లీలో చెప్పాను.. ఇకపై రేట్లు పెంచే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే తాజాగా జీవో విడుదలైందని, దీనిపై నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావద్దని తేల్చి చెప్పారు. సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే ధరలు తగ్గాల్సిందేనని, సామాన్యుడిపై భారం పడనివ్వబోమని మంత్రి ఉద్ఘాటించారు.