News November 5, 2025

NLG: 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలంలో ఇప్పటి వరకు 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, అందులో 46,568 మెట్రిక్ టన్నుల ధాన్యం ఓపీఎంఎస్‌లో ఎంట్రీ చేసి.. 5,657 మంది రైతులకు రూ.102 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.

Similar News

News January 22, 2026

నల్గొండ : పీజీ సెమిస్టర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో PG ( M.A / M.Sc / M.Com / M.S.W ) సెమిస్టర్-1 రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

News January 22, 2026

NLG: బాలికల హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

జిల్లా కేంద్రంలోని SC బాలికల హాస్టల్, పాత బాలికల డి-హాస్టల్‌ను కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వసతులు, భోజనం మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హాస్టల్‌లో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

చెరువుగట్టులో కోనేటి స్నానం చేస్తే సకల పాపాలు హరి

image

తెలంగాణలో రెండవ శ్రీశైలంగా పేరు పొందిన చెరువుగట్టు దేవస్థానం జాతరకు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు అధికారులు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువుగట్టు గుట్టపై గల కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో అగ్ని గుండాల ప్రవేశం అత్యంత కీలకం. ‘హరిహర మహాదేవ శంభో శంకర’ అంటూ నినదిస్తూ నిప్పు కణికలపై నడుస్తారు. కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.