News April 22, 2024

NLG: 24న రఘువీర్ రెడ్డి నామినేషన్

image

నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్రెడ్డి ఈనెల 24న నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి నామినేషన్ సమర్పిస్తారు. 12 గంటలకు గడియారం సెంటర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నామినేషన్, బహిరంగ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి పాల్గొననున్నారు.

Similar News

News December 11, 2025

నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

image

అంతయ్యగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కన్నెబోయిన లక్ష్మయ్య విజయం సాధించారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్‌ అభ్యర్థి బ్రహ్మచారిపై 21 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మద్దతుదారులు బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు.

News December 11, 2025

MGU పీజీ సెమిస్టర్-3 పరీక్షల టైం టేబుల్ విడుదల

image

MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్‌ను డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్‌ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.

News December 11, 2025

BREAKING: చౌటుప్పల్ హైవేపై భారీగా ట్రాఫిక్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున పల్లె బాట పట్టారు. పట్నం ప్రజలు సొంతూళ్లకు తరలిరావడంతో చౌటుప్పల్ వద్ద హైవేపై భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.