News February 16, 2025
NLG: 75 మందికి కౌన్సెలింగ్.. పోస్టింగ్ ఆర్డర్లు

2008 డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో డీఈఓ బిక్షపతి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. జిల్లాలో 75 మంది అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరికి ప్రతి నెల రూ.31,040 వేతనం ఇవ్వనున్నారు.
Similar News
News March 20, 2025
NLG: 105 సెంటర్లలో రేపటి నుంచి పది పరీక్షలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో 18,666 మంది రెగ్యులర్, 259 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, 6 లైన్స్ కార్డ్ బృందాలను ఏర్పాటు చేశారు
News March 20, 2025
NLG: దరఖాస్తులకు చివరి తేదీ మరో 11 రోజులే!

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో విద్యనభ్యసిస్తున్న షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాల మంజూరి కొరకు ఈనెల 31 లోగా ధరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు వి. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయని విద్యార్థులు వెబ్సైట్ https://telanganaepass.cgg.gov.inలో నమోదు చేసుకోవాలని తెలిపారు.
News March 20, 2025
NLG: పిచ్చుకల దినోత్సవం సరే.. సంరక్షణ ఏది..?

పల్లెల్లో పిచ్చుకలను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. రైతులు వాటిని ఆకలి తీర్చడానికి వరి, సజ్జ, జొన్న, కంకులను ఇళ్లలో వేలాడదీసేవారు. అవి ఇంట్లోనే గూళ్లను ఏర్పరచుకుని వాటిని తింటూ కిచకిచలాడుతూ ఉండేవి. కాలక్రమేణా కాలుష్యం, పట్టణీకరణ, రేడియేషన్ ప్రభావంతో అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రతి ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నా ప్రభుత్వం వాటి సంరక్షణకు శ్రద్ధ చూపడం లేదు.