News April 11, 2024
NLR: ‘జనసేనకు పట్టిన దరిద్రం పోయింది’

నెల్లూరు జిల్లాలో జనసేనకు పట్టిన దరిద్రం పోయిందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని వైసీపీ నాయకులు కలవడంతో సంబరాలు చేసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి జనసేనను వీడితే తమకు సంతోషమేనని.. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు.
Similar News
News December 5, 2025
అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.


