News June 23, 2024

NLR: రైతులకు ఉచితంగా పంపిణీ

image

నెల్లూరు జిల్లాకు 700 పొద్దు తిరుగుడు విత్తనాల కిట్స్ వచ్చాయని వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు. ఒక్కో కిట్‌లో 2 కిలోల విత్తనాలు ఉంటాయని, వీటిని రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలు అవసరమైన రైతులు మండల వ్యవసాయ అధికారులను లేదా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఓ రైతుకు ఒక కిట్ మాత్రమే అందజేస్తామన్నారు.

Similar News

News November 10, 2024

నాయుడుపేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు గ్రామ సమీపంలో రహదారిపై శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ దార్ల వెంకటరమణయ్య (26) మృతి చెందారు. తన్నమాల గ్రామానికి చెందిన వెంకట రమణయ్య ఆటో తీసుకొని నాయుడుపేట నుంచి పండ్లూరు గ్రామానికి వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 10, 2024

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస లక్ష దీపోత్సవం

image

నెల్లూరులోని విఆర్సి గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం రెండో రోజు ఘనంగా నిర్వహించారు. రుద్ర హోమం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన విశేష రుద్ర హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

News November 10, 2024

కావలికి శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు రాక

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ఆదివారం కావలి పట్టణానికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలోని మినీ స్టేడియాన్ని సందర్శిస్తారు. తదుపరి స్థానిక ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.