News November 8, 2025
NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News January 18, 2026
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో గ్రీవెన్స్ డే సోమవారం జరగనుంది. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని చెప్పారు. Meekosam.ap.gov.in, 1100 కాల్ సెంటర్ ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News January 18, 2026
నెల్లూరు: 9లక్షలకు పైగానే ఫ్రీ బస్ ఎక్కారు..!

సంక్రాంతి కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడాయి. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో మహిళలు సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈనెల 8 నుంచి 16వ వరకు నెల్లూరు జిల్లాలోని 7 డిపోల పరిధిలో 9,55,083 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను ప్రభుత్వంపై రూ.3,89,85,130 భారం పడింది.
News January 18, 2026
వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.


