News October 4, 2025

NMMS పరీక్ష దరఖాస్తుకు అక్టోబర్ 15 వరకు పొడిగింపు: డీఈవో

image

2025 డిసెంబర్ 7న జరగనున్న NMMS పరీక్షకు దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు డీఈఓ వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 16, పాఠశాలల నుంచి నామినల్ రోల్ సమర్పణకు అక్టోబర్ 18 చివరి తేదీ అన్నారు. ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలు www.bse.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.

Similar News

News January 12, 2026

కోడి పందేల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

image

జిల్లాలో కోడి పందేలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. కోడి పందేలు నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.

News January 12, 2026

తిరుపతి: శెట్టిపల్లి లబ్ధిదారులకు సంక్రాంతి బోనస్

image

తిరుపతి జిల్లా సెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. తుడా అథారిటీ ద్వారా కేటాయించే మొత్తం 286.83 ఎకరాల భూమికి సంబంధించిన అన్ని కన్వేయన్స్ డీడ్లపై స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు రూ.16.25 కోట్ల వరకు ఆర్థికభారం తగ్గనుందని అధికారులు అంచనా వేశారు.

News January 12, 2026

ఖమ్మం: బస్సు కోసం వేచి ఉంటూ.. అనంతలోకాలకు!

image

నేలకొండపల్లిలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.