News April 1, 2024

ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్‌పై చర్యలు తీసుకోము: ఐటీ శాఖ

image

కాంగ్రెస్‌కు రూ.1700కోట్ల పన్ను నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సొమ్ము రికవరీపై తాము ఎలాంటి చర్యలు చేపట్టమని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ తాము ఏ పార్టీకి ఆటంకాలు కలిగించాలని అనుకోవట్లేదని తెలిపింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేయాలని కోర్టుకు ఐటీ శాఖ విజ్ఞప్తి చేసింది.

Similar News

News February 18, 2026

నిర్మాణ దశలో ఖాళీ స్థలం పన్ను 50%కి తగ్గింపు: నారాయణ

image

AP: భవన నిర్మాణదారులకు GOVT గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణాల సమయంలో ఖాళీ స్థలం పన్నును 50%కి తగ్గిస్తున్నట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. బిల్డర్లను ప్రోత్సహించడం, నిర్మాణ దశలో వ్యయభారాన్ని తగ్గించేందుకు ఈ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఇది వర్తిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన చట్టసవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు.

News February 18, 2026

2027లో అల్లు అర్జున్ నుంచి రెండు సినిమాలు?

image

అల్లు అర్జున్ వచ్చే ఏడాది 2 సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ డైరెక్షన్‌లో చేస్తున్న AA22 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే లోకేశ్ కనగరాజ్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు మైత్రి సంస్థ తాజాగా ప్రకటించింది. AA, లోకేశ్ కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు 2027లోనే రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News February 18, 2026

ప్రభుత్వ ఆఫీసులలో AC ఉష్ణోగ్రతపై పరిమితి

image

TG: ప్రభుత్వ ఆఫీసులలో ACలను కనిష్ఠంగా 25డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం పరిమితి విధించింది. ఇంధన పొదుపుతో పాటు బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఆఫీసులు, స్కీముల విద్యుత్ బిల్లులు కొండల్లా పేరుకుపోయాయి. కొన్నేళ్లుగా డిస్కమ్‌లకు వీటి నుంచి రావాల్సిన బకాయి ₹48వేల CR వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.