News June 15, 2024

ఆప్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

image

ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అనర్హత వేటు వేశారు. దళితులకు ఆప్ సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేని ఆరోపిస్తూ రాజ్‌కుమార్ ఏప్రిల్‌లో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఎస్పీలో చేరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించినా పలుమార్లు గైర్హాజరవడంతో ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేశారు.

Similar News

News September 20, 2024

రాజకీయాల నుంచి ఆలయాలకు స్వేచ్ఛ ఇవ్వాలా?

image

తిరుపతి లడ్డూ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ రాజకీయ విమర్శలతో ఆలయాలకు స్వేచ్ఛ అవసరమనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని భక్తులు, నెటిజన్లు కోరుతున్నారు. కోట్ల మంది మనోభావాలు, నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన ఆలయాలకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News September 20, 2024

అమెరికా పిల్లల్లో వింత వైరస్ వ్యాప్తి

image

అమెరికాలో ఓ కొత్త వైరస్ పిల్లలపై దాడి చేస్తోంది. శ్వాసకోసపై దాడి చేసి వారిలో పోలియో తరహాలో పక్షవాతాన్ని కలుగజేస్తోందని అక్కడి పరిశోధకులు తెలిపారు. చిన్నారుల్లో నరాల సంబంధిత సమస్యల్ని తీసుకొచ్చే ఎంటెరోవైరస్ డీ68 స్ట్రెయిన్‌ను దేశవ్యాప్తంగా మురుగునీటిలో గుర్తించినట్లు వెల్లడించారు. పిల్లల కాళ్లూచేతులు చచ్చుబడిపోతున్నాయని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

News September 19, 2024

పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త

image

AP: అర్హులకు పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలోనే సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెర్ప్‌పై CM చంద్రబాబుతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడారు. ‘పెన్షన్లు అందని వారికి పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే అంశంపై చర్చించాం. 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 15 లక్షల మంది ఉన్నారు. త్వరలోనే వారికి పెన్షన్లు ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తాం’ అని మంత్రి చెప్పారు.