News August 22, 2025
అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేదు: నారాయణ

AP: అమరావతిపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ‘వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలి. అది పూర్తిగా మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయి. అధికారులు రోడ్డుకు గండికొట్టి నీటిని బయటకు పంపించారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్లు డిజైన్ చేశారు. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారు’ అని తెలిపారు.
Similar News
News January 13, 2026
తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ!

TG: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈనెల 18న మేడారం జాతర ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, రైతు భరోసా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి రానున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం.
News January 13, 2026
ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>
News January 13, 2026
SBI ఖాతాదారులకు అలర్ట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.


