News April 25, 2024
ఇకపై ‘హార్లిక్స్’ హెల్త్ డ్రింక్ కాదు

బోర్న్‌విటా తర్వాత మరో మాల్టెడ్ మిల్క్ పౌడర్ ‘హెల్త్ డ్రింక్’ ట్యాగ్ కోల్పోయింది. హార్లిక్స్‌కు ‘హెల్త్’ ట్యాగ్‌ను తొలగిస్తున్నట్లు హిందుస్థాన్ యూనిలివర్ వెల్లడించింది. తమ ఉత్పత్తుల్లోని ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరీని ‘ఫంక్షనల్ న్యూట్రీషనల్ డ్రింక్స్’గా మారుస్తున్నట్లు తెలిపింది. డ్రింక్స్, బెవరేజెస్‌ను హెల్తీ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలన్న కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
News April 19, 2026
వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.


