News March 27, 2024
103 సిట్టింగ్‌లకు నో టికెట్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటిదాకా బీజేపీ 405 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో 103 మంది సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించింది. పూర్తి జాబితా వచ్చేసరికి ఈ సంఖ్య పెరగొచ్చు. గత ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరించినప్పటికీ BJP 300కు పైగా సీట్లను గెలుచుకుంది. ఈ సారి ఏకంగా 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా.. అభ్యర్థుల మార్పు ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.
Similar News
News February 18, 2026
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

T20WC: అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ స్థానంలో సుందర్, కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్ పాండ్య, దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
News February 18, 2026
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 24 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech/MCA, MBA, BSc/BCom/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.tcil.net.in
News February 18, 2026
భూ రిజిస్ట్రేషన్ల అక్రమార్కుల్ని వదిలిపెట్టం: పొంగులేటి

TG: ధరణి పోర్టల్‌లోని వ్యవస్థీకృత లోపాల వల్లనే రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహా సహా ఇతర అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘గత పాలకుల కాలంలో అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల లాగిన్ డిలీట్ చేశారు. వారి స్వార్థానికి చేసిన లోపాలతో రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహాకు దారితీసింది. వారినెవరినీ వదిలిపెట్టం. కోడ్ ఆడిట్‌కు ఆదేశించాం. భవిష్యత్తులో లోపాలకు తావుండరాదు’ అని పేర్కొన్నారు.


