News April 11, 2024

22న సీఎం జగన్ నామినేషన్?

image

AP: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఈనెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 18న నోటిఫికేషన్ రానుంది. దీంతో ఆయన 21న సొంత నియోజకవర్గానికి చేరుకోని, రెండు రోజులు అక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పులివెందుల నియోజకవర్గంలో తన తరఫున సతీమణి భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి, జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర కొనసాగిస్తారని సమాచారం.

Similar News

News December 14, 2025

హనుమాన్ చాలీసా భావం – 38

image

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 14, 2025

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో భారీ జీతంతో ఉద్యోగాలు

image

<>దామోదర్<<>> వ్యాలీ కార్పొరేషన్ 9 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ మైనింగ్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.67,700-రూ.2,08,700 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.dvc.gov.in

News December 14, 2025

రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

image

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్‌ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.