News March 6, 2025

నోటిఫికేషన్ విడుదల

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో BSFలో 24, CRPFలో 204, CISFలో 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
సైట్: upsc.gov.in/

Similar News

News December 17, 2025

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో శిక్షణ

image

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్‌వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రాంగణంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.

News December 17, 2025

30కి పైగా దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

image

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్‌ విధించారు. ఇటీవల 12 దేశాలపై విధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 30కి పైనే ఉంది. పాలస్తీనా, సిరియా, జింబాబ్వే సహా అనేక దేశాలు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌పై కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దేశ పౌరుల రికార్డుల విషయంలో నమ్మకం లేకపోవడంతో పాటు అవినీతి, క్రిమినల్ కేసులు వంటివి కారణాలుగా పేర్కొన్నారు.

News December 17, 2025

పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

image

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.