News May 4, 2024

రాష్ట్రంలో SR ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

image

AP: 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియమానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 44 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. జీతం రూ.70వేల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి

Similar News

News December 5, 2025

అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్‌<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు.

News December 5, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్‌ హబ్‌కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90.43కి పతనం

News December 5, 2025

క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

image

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.