News April 24, 2025

NRML: ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్‌‌కు గంజాయి రవాణా

image

నిర్మల్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. పోలీసుల వివరాలిలా.. మలావత్‌ రాజేందర్, ఇండాల్‌ రాథోడ్‌ ఆదిలాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. బుధవారం కారులో గంజాయి ప్యాకెట్లు తీసుకుని నగరానికి వస్తుండగా బోయిన్‌పల్లి వద్ద ఎక్సైజ్‌ SI శివకృష్ణ వీరిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News March 17, 2026

MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

image

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.

News March 17, 2026

తాడేపల్లిగూడెం: ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్

image

తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న రౌతు రామకృష్ణ మంగళవారం ఏసీబీ వలలో చిక్కారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. మున్సిపల్ సర్వేయర్, ఇంచార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా పనిచేస్తూ రామకృష్ణ పలుమార్లు అవినీతికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వేయర్, సిబ్బంది, కుటుంబీకులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 17, 2026

ఓడ నుంచి సిలిండర్లలోకి LPG.. ప్రాసెస్ ఇదే!

image

‘నందాదేవి’ షిప్ INDకు <<19406038>>చేరుకుంది<<>>. పైపుల ద్వారా గ్యాస్‌ను పంపించేందుకు దానిని -40°Cకు చల్లబరుస్తారు. ఓడరేవుకు షిప్ రాగానే దానికి పైపులను అటాచ్ చేసి ప్రెజర్ పంపుల ద్వారా ద్రవ రూపంలో ఉన్న గ్యాస్‌ను తీరంలోని స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడ వడపోసిన తర్వాత గ్యాస్ లీక్ అయితే గుర్తుపట్టడానికి ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఆ తర్వాత ఖాళీ సిలిండర్లలో సరైన పరిమాణంలో గ్యాస్ నింపి సీల్ వేస్తారు.