News February 17, 2025
NRPTలో అనుమానాస్పద స్థితిలో చిరుత మరణాలు.!

NRPT జిల్లాలో వేల ఎకరాలలో ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఈమధ్య కాలంలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని సంతోషించే లోపే చిరుతల అనుమానాస్పద మృతి ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. మద్దూరు, దామరగిద్ద మండలాల్లో ఇటీవల ఐదు చిరుత పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జాదరావుపల్లి, నందిపాడు ఉడుమల్గిద్ద, కంసాన్ పల్లి, వారం క్రితం ఉడ్మల్‌గిద్దలో నిన్న మోమినాపూర్‌లో అనుమానాస్పదంగా చిరుతలు మృత్యువాత పడ్డాయి.
Similar News
News March 18, 2025
MBNR: తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టండి: కలెక్టర్

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఛాంబర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యపై సమీక్షించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.
News March 18, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔ముదిరాజులను BC-Aలో చేర్చాలి:ముదిరాజులు ✔జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి ✔ఎంపీ డీకే అరుణ నివాసంలో పోలీసులు ✔పెరుగుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్లు ✔సాగునీరు అందక రైతులకు ఇబ్బందులు:NHPS ✔వట్టెం వెంకన్నస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు ✔NGKL:SLBC D1,D2 ప్రదేశాలు గుర్తింపు:కలెక్టర్ ✔మద్దూర్:విద్యుత్తు తీగలు తాకి లారీ దగ్ధం
News March 17, 2025
MBNR: ప్రజావాణికి 130 ఫిర్యాదులు

ప్రజావాణికి 130 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.