News February 17, 2025
NRPTలో అనుమానాస్పద స్థితిలో చిరుత మరణాలు.!

NRPT జిల్లాలో వేల ఎకరాలలో ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఈమధ్య కాలంలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని సంతోషించే లోపే చిరుతల అనుమానాస్పద మృతి ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. మద్దూరు, దామరగిద్ద మండలాల్లో ఇటీవల ఐదు చిరుత పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జాదరావుపల్లి, నందిపాడు ఉడుమల్గిద్ద, కంసాన్ పల్లి, వారం క్రితం ఉడ్మల్‌గిద్దలో నిన్న మోమినాపూర్‌లో అనుమానాస్పదంగా చిరుతలు మృత్యువాత పడ్డాయి.
Similar News
News March 14, 2026
CTR: వాటర్ బాటిల్ ధరల పెంపు ఇందుకే.!

ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే ‘పాలిమర్’ వాటర్ బాటిల్ తయారీకి కీలకం. యుద్ధ నేపథ్యంలో చమురు రేట్లు పెరగటంతో పాలిమర్ రేట్లు సైతం 50% మేర పెరిగాయి. ఇక వాటర్ బాటిల్ క్యాప్ ధర కూడా దాదాపు రూ.0.50 పైసలకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో పాలిమర్ KG ధర రూ.160-180 మధ్య ఉంది. ఇంతకు ముందు ఇది రూ.10లోపే ఉండేదని వ్యాపారులు అంటున్నారు. దీంతో దుకాణాల్లో <<19382920>>వాటర్ బాటిల్స్<<>> ధరలు పెరుగనున్నట్లు తెలుస్తోంది.
News March 14, 2026
IPL.. ధోనీ స్థానంలో సంజూ కీపింగ్ చేయాలి: రైనా

ఈ ఏడాది ఐపీఎల్‌లో CSKకు ధోనీ స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. అలాగే ఓపెనర్‌గా కాకుండా ఆయనను మూడో స్థానంలో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ‘ఓపెనర్లుగా రుతురాజ్, ఆయుష్ మాత్రేను పంపించాలి. 4 ,5 స్థానాల్లో బ్రెవిస్, శివమ్ దూబే, ఆరో ప్లేస్‌లో ప్రశాంత్/అకేల్ హోసేన్/నూర్ అహ్మద్‌లలో ఎవరిని తీసుకుంటారో వేచిచూడాలి’ అని పేర్కొన్నారు.
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.


