News February 17, 2025

NRPTలో అనుమానాస్పద స్థితిలో చిరుత మరణాలు.!

image

NRPT జిల్లాలో వేల ఎకరాలలో ఫారెస్ట్ అడవి విస్తరించి ఉంది. ఈమధ్య కాలంలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని సంతోషించే లోపే చిరుతల అనుమానాస్పద మృతి ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. మద్దూరు, దామరగిద్ద మండలాల్లో ఇటీవల ఐదు చిరుత పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జాదరావుపల్లి, నందిపాడు ఉడుమల్గిద్ద, కంసాన్ పల్లి, వారం క్రితం ఉడ్మల్‌గిద్దలో నిన్న మోమినాపూర్‌లో అనుమానాస్పదంగా చిరుతలు మృత్యువాత పడ్డాయి.

Similar News

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

image

గత రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల వివాదంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాల ఆందోళనలతో ఎక్కడైతే ఇళ్లు కూల్చారో, అక్కడే 9 ఎకరాల్లో లేఅవుట్‌ చేసి 311 మంది బాధితులకు 75 గజాల చొప్పున పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో నేడు పట్టాల పంపిణీ చేపట్టనుంది. ఈ పరిణామం ప్రభుత్వానికి ఎంతవరకు మైలేజీ ఇస్తుందో వేచి చూడాలి.

News March 11, 2026

చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

image

చైనాకు చెందిన మిజార్‌విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.