News April 23, 2025

NRPT: ‘అర్హులను పకడ్బందీగా ఎంపిక చేయాలి’

image

రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఎంపీడీఓ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యతగా మహిళలు, దివ్యాంగులను ఎంపిక చేయాలని చెప్పారు. ఈనెల 25 వరకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు.

Similar News

News March 17, 2026

రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే: ఆది శ్రీనివాస్

image

రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.20,616 కోట్లను ఏకకాలంలో మాఫీ చేశామని అన్నారు. దీంతో సుమారు 25 లక్షల మంది రైతులు కొత్తగా రుణం పొందే అవకాశం కల్పించామన్నారు. రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు అన్నారు.

News March 17, 2026

జగిత్యాల మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అమావాస్య, ఉగాది సందర్భంగా మార్చి 18, 19వ తేదీల్లో మార్కెట్ యార్డ్‌కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్చి 20 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు గమనించి సహకరించాలని కోరారు.

News March 17, 2026

సీఎం హార్వర్డ్ కోర్సుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించింది: KTR

image

TG: సీఎం రేవంత్ <<18999625>>హార్వర్డ్<<>> కోర్సు ఫీజులు, విమాన ఖర్చులు ప్రభుత్వమే చెల్లించిందని అసెంబ్లీలో KTR ఆరోపించారు. ‘RTI ద్వారా వివరాలు తెలుసుకున్నాం. సర్కార్ విద్యాశాఖ మంత్రి(రేవంత్) ఫీజులు కడుతుంది కానీ రాష్ట్రంలోని విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించదా? గురుకులాల్లో నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది. యూనివర్సిటీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది’ అని మండిపడ్డారు.