News August 12, 2025

NRPT: ఈనెల 18 నుంచి సర్వేయర్లకు శిక్షణ

image

ఈ నెల 18 నుంచి 2వ బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ ప్రారంభమవుతుందని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. శిక్షణకు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు జిరాక్స్ కాపీలు తేవాలని, ప్రభుత్వ సివిల్ సర్జన్ వైద్యుల చేత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని చెప్పారు. అభ్యర్థులు 18న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు.

Similar News

News March 16, 2026

బంగ్లా చేతిలో ఓటమి.. పాక్‌పై మాజీ క్రికెటర్ సెటైర్లు

image

బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ <<19394139>>కోల్పోయిన<<>> పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సెటైర్లు వేశారు. నెదర్లాండ్స్ కూడా PAKను ఓడించి టెస్టు హోదా పొందాలని కోరుకుంటుందని చెప్పారు. అంతటి దారుణ స్థితిలో తమ టీమ్ ఉందన్నారు. ఆసియా కప్‌ను INDకు అందజేయని PCB చీఫ్ నఖ్వీపైనా విమర్శలు గుప్పించారు. ఇతర జట్లను ఓడించకుండా ICC ట్రోఫీలను దొంగిలిస్తారా అని ప్రశ్నించారు.

News March 16, 2026

వేసవి తాపం.. కల్లుకు ఫుల్ గిరాకీ!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు ముదురుతుండటంతో ప్రకృతి సిద్ధమైన తాటి కల్లుకు గిరాకీ అమాంతం పెరిగింది. బీర్ల ధరలు సామాన్యులకు భారంగా మారడం, కల్లులో ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం, ప్రోబయోటిక్స్ ఉండటంతో పాటు చలువ కావటంతో జనం తాటి వనాలకు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే పట్టణ వాసులు అక్కడకి చేరుకుంటుండటంతో గీత కార్మికులకు మంచి ఉపాధి లభిస్తోంది. జిల్లాలో దాదాపు 16,500 మంది గీతకార్మికులు ఉన్నారు.

News March 16, 2026

HYD: ఎమ్మెల్యే సాబ్.. లొల్లిజేశైనా సమస్య తెంపు!

image

‘‘పార్టీ ఏదైనా హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఆదరించారు. సిటీ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోనే మీకు ఓటు వేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జరిగే అసెంబ్లీలో మీరు (సిటీ ఎమ్మెల్యేలు) గళం విప్పితే సర్కారు వింటుంది. అపుడు సమస్యలు పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అందుకే MLA సాబ్ సభలో లొల్లిజేశైనా సమస్యను తెంపు’ అని నగరవాసులు కోరుతున్నారు.