News April 11, 2025
NRPT: ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోండి

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై నారాయణపేట కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఎన్ఆర్ఈజీఎస్, విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపనిపై సమీక్ష చేశారు. రాజీవ్ యువ వికాస పథకానికి ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News January 23, 2026
నేటి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 38,000 బస్తాల సరుకు వచ్చింది. ఇందులో 28,000 బస్తాలు కొత్త పంట కాగా, 10,000 బస్తాలు ఏసీ నిల్వలు ఉన్నాయి. తేజా రకం ధర స్వల్పంగా తగ్గింది. గరిష్టంగా రూ.18,300 పలికినప్పటికీ, సగటున రూ.18,000 వద్దే లావాదేవీలు జరిగాయి. 341, డీడీ రకాలు రూ.24,000 నుండి రూ.24,500 వరకు అమ్ముడుపోయాయి. బ్యాడిగి ఏసీ రకం గరిష్టంగా రూ.30,000 వరకు పలికింది. ఆర్మూర్ రకం రూ.16,500 వద్ద నిలిచింది.
News January 23, 2026
సంగారెడ్డి: ఇంటర్ హాల్ టికెట్లు సరి చూసుకోండి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ హాల్ టికెట్లు సరిచూసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సూచించారు. http://tgbie.cgg.gov.inలో హాల్ టికెట్ చూసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే ఈనెల 25వ తేదీలోపు సరిచేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.
News January 23, 2026
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf-srf-project-positions/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 27.


