News November 7, 2025
NRPT: కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాల మేరకు జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలో బాలికలకు కరాటే లో శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు (కరాటే మాస్టర్లు) దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేష్ గురువారం ప్రకటనలో కోరారు. ఈ నెల 9 సాయంత్రం లోపు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గల డీవైఎస్‌వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. స్థానిక మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
Similar News
News January 16, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 16, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.26 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 16, 2026
ఉద్రిక్తతల వేళ.. భారతీయులకు అలర్ట్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. అవసరం లేని ప్రయాణాలు చేయొద్దని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో భారత ఎంబసీ హెల్ప్‌లైన్ నెంబర్లను (+972-54-7520711, +972-54-3278392) సంప్రదించాలని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులను (10,000 మంది) స్వదేశానికి తరలించే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తోంది.
News January 16, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


