News August 20, 2025

NRPT: క్రీడాకారులను అభినందించిన DEO

image

ఈనెల 18, 19న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంబాద్ గురుకుల విద్యా పిట్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో నారాయణపేట జిల్లా బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచింది. దీంతో బుధవారం DEO గోవిందరాజు క్రీడాకారులను అభినందించి ప్రశంస పత్రాలను అందించారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని అన్నారు. కార్యక్రమంలో SGF సెక్రటరీ నరసింహులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 16, 2026

పెద్దపల్లి: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి: డీసీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పురపాలక సంఘ ఉద్యోగులకు ‘Arrive – Alive’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగం, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఆదర్శంగా రోడ్డు భద్రత పాటించాలని పిలుపునిచ్చారు.

News January 16, 2026

BREAKING.. నెల్లూరు: బీచ్‌లో నలుగురు గల్లంతు..

image

అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి ఆలల ఉధృతికి గల్లంతయ్యారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటికి తీసుకొచ్చారు.

News January 16, 2026

Money Tip: మీకు మీరే శిక్ష వేసుకోండి.. వినూత్న పొదుపు మంత్రం!

image

మీకున్న చెడు అలవాట్లపై మీరే పన్ను వేసుకోండి. డబ్బు ఆదా చేయడానికి ఇదొక వినూత్న మార్గం. అనవసర ఖర్చు చేసినప్పుడు అంతే మొత్తాన్ని పెనాల్టీగా మీ సేవింగ్స్‌ అకౌంట్‌లోకి డిపాజిట్ చేయండి. Ex ఒక బర్గర్ కొంటే దానికి సమానమైన డబ్బును వెంటనే అకౌంట్‌కు మళ్లించాలి. ఇలా చేస్తూ వెళ్తే పోగైన డబ్బును బట్టి మీకున్న బ్యాడ్ హాబిట్స్ వల్ల ఎంత నష్టమో తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ అలవడుతుంది. పొదుపు అలవాటవుతుంది.