News February 18, 2025

NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

image

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Similar News

News April 12, 2026

నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.

News April 12, 2026

ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-3లో ఇదీ పరిస్థితి!

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630841>>HYD<<>>-3లో రెగ్యులర్ విద్యార్థులు 11673 మంది పరీక్షలు రాయగా 8521 మంది పాసై 73 శాతంతో స్టేట్‌లో 15వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 600 మందికి 473 మంది పాసై 78.83%తో 7వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 2274 మందికి 640 మంది పాసై 28.14%తో 30వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 48 మందికి 23 మంది పాసై 47.92%తో 24వ ప్లేస్ వచ్చింది.