News November 19, 2025

NRPT: చీరల పంపిణీ విజయవంతంగా నిర్వహించాలి

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి” పేరిట” ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరా మహిళ శక్తి చీరలు ఇవ్వాలని సూచించారు.

Similar News

News January 19, 2026

నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

image

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.

News January 19, 2026

తిరుమలలో ఆ మూడు విగ్రహాలు ఎవరివో తెలుసా..!

image

తిరుమల శ్రీవారి ఆలయంలోని తిరుమలరాయ మండపంలో నమస్కారం చేస్తూ ముగ్గురు భక్తుల రాగి విగ్రహాలను ఎప్పుడైనా చూశారా. లాలాఖేమరాము (రాజా తోడరమల్లు), ఆయన తల్లి మాతా మోహనదేవి, భార్య పితాబీబీ. ఆర్కాట్ నవాబు సాదతుల్లాఖాన్ కొలువులో అతని ప్రతినిధిగా కర్నాటకను పర్యవేక్షించిన ప్రధానాధికారి, క్షత్రియవీరుడు తోడరమల్లు. 17వ శతాబ్దంలో మహమ్మదీయులు, ఆంగ్లేయుల నుంచి తిరుమల క్షేత్రాన్ని కాపాడారు.

News January 19, 2026

మెళియాపుట్టి: ‘వినోదం కోసం వెళ్తే విషాదం ఆవరించింది’

image

వినోదం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆడలి వ్యూ పాయింట్‌కు వెళ్లిన కుటుంబంలో విషాదం నింపింది. నిన్న సాయంత్రం ఏజెన్సీలో ప్రకృతి అందాలను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా..వారి వాహనం ఆడలి వ్యూ పాయింట్ వద్ద రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు మెళియాపుట్టి మండలానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.