News May 7, 2025
NRPT: దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

భూభారతి దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ శిక్త పట్నాయక్ శుక్రవారం రోజు మద్దూరు మండల పరిధిలోని దంగల్పూర్, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అధికారులకు సూచించారు. రైతులు ఇచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు. ఎటువంటి భూ సమస్య అయినా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్దూర్ తహశీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 10, 2026
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఎన్నిక వాయిదా

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప మృతితో అక్కడి ఎన్నికను SEC వాయిదా చేసింది. మరో తేదీపై త్వరలో ప్రకటన చేయనుంది. కాగా రేపు పోలింగ్ జరగాల్సి ఉండగా నిన్న రాత్రి ఆయన <<19098651>>సూసైడ్<<>> చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News February 10, 2026
ఇంకెన్నాళ్లు కల్తీ రాజకీయం: SV మోహన్ రెడ్డి

తిరుమల, శ్రీశైలం దేవాలయాల్లో లడ్డూ ప్రసాదం కల్తీ అని ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ వివాదంలో బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని, ఇంకెన్నాళ్లు ఈ కల్తీ రాజకీయం చేస్తారని ఆయన మండిపడ్డారు.
News February 10, 2026
ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు.. ఎస్పీ హెచ్చరిక

మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే 123 కేసులు నమోదు చేసి సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 208 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. 30 కేసుల్లో రూ.1.57 లక్షల విలువైన 249 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


