News November 7, 2025
NRPT: నవంబర్ 14న ‘చదువుల పండగ’: కలెక్టర్

నవంబర్ 14న జిల్లా స్థాయిలో ‘చదువుల పండగ-కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం!’ అనే నినాదంతో మహా వేడుక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే ఉత్సాహం నింపే లక్ష్యంతో ఈ పండుగను నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
Similar News
News January 22, 2026
NGKL: నాపై తప్పుడు ప్రచారం చేస్తే దీక్ష తప్పదు: మల్లు రవి

తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారు క్షమాపణ చెప్పకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి తాను అభివృద్ధి పనుల్లో పాల్గొన్నానని, అయినా కొందరు తనపై బురద చల్లడం తగదన్నారు.
News January 22, 2026
HEADLINES

* ‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CM CBN
* దావోస్‌లో కొనసాగుతున్న CM రేవంత్ టూర్
* అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్ రెడ్డి
* ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా: జగన్
* నైనీ కోల్ బ్లాక్ వివాదం.. రేవంత్‌తో బీజేపీ చీకటి ఒప్పందమన్న కేటీఆర్
* తొలి టీ20.. కివీస్‌పై భారత్ ఘన విజయం
* ఇవాళ 10గ్రా. బంగారం రూ.7వేలు, కేజీ వెండిపై రూ.5వేలు పెరిగిన ధర
News January 22, 2026
అభిషేక్… రికార్డులు షేక్

న్యూజిలాండ్‌తో తొలి T20లో అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించారు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు, 25 లేదా అంతకంటే తక్కువ బాల్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గతంలో సూర్య, సాల్ట్, లూయిస్‌తో(7 సార్లు) సంయుక్తంగా ఉన్న అభిషేక్ ఇవాళ వారిని అధిగమించారు. NZపై ఓ భారత్ బ్యాటర్ అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడంలోనూ ఘనత వహించారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో 50 కొట్టారు.


