News August 13, 2025

NRPT: పరేడ్ మైదానాన్ని పరిశీలించిన ఎస్పీ

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బుధవారం నారాయణపేటలోని పరేడ్ మైదానాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. సాయుధ పోలీస్ బలగాలు కవాతులో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 12, 2026

23న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన: CM

image

APలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు CM CBN ప్రకటించారు. ఈ కార్యక్రమానికి PM మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రూ.1.35 లక్షల కోట్లతో 2 దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.

News March 12, 2026

కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

image

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.

News March 12, 2026

సిద్దిపేట: టెన్త్ పరీక్షలు.. డీఈఓ కీలక సూచనలు

image

ఈనెల 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు సిద్దిపేట DEO శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల వస్తువుల భద్రత కోసం క్లాక్ రూమ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.