News March 8, 2025

NRPT: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ

image

సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శుక్రవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని ఎస్ఐ, సీఐ, డీఎస్పీలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, అత్యాధునిక, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కేసులను ఛేదించాలని చెప్పారు.

Similar News

News December 17, 2025

కడప జిల్లాలో ‘ఫేస్ వాష్ అండ్ గో’

image

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళ పలుచోట్ల వాహనాలను నిలిపారు. లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లకు నీరు అందించి ఫేస్ వాష్ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

News December 17, 2025

మక్తల్: @1 PM 80.12 శాతం పోలింగ్ నమోదు

image

మక్తల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంటకు పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయిదు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు 80.12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారిగా మక్తల్ 81.76%, మాగనూరు 84.17%, ఉట్కూర్ 72.42%, నర్వ 88.35%, కృష్ణ మండలంలో 78.18 శాతం పోలింగ్ నమోదైంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

News December 17, 2025

Avatar-3కి షాకింగ్ రివ్యూస్

image

ఈనెల 19న రిలీజ్ కాబోతున్న అవతార్3కి కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇప్పటికే రివ్యూస్ ఇచ్చేస్తున్నాయి. BBC, గార్డియన్, రోటెన్ టొమాటోస్, IGN సహా మీడియా హౌజెస్ మూవీ స్టోరీ ఆకట్టుకోదని చెబుతున్నాయి. కామెరూన్ టేకింగ్, యాక్షన్ బాగున్నా కొన్ని సీన్స్ గతంలో చూశాం అనే ఫీల్ కల్గిస్తాయట. BBC 1/5, గార్డియన్ 2/5 రేటింగ్ ఇచ్చాయి. కాగా అవతార్1కు మంచి రెస్పాన్స్ రాగా, పార్ట్2ను క్రిటిక్స్ ఓకే అన్నారు.