News March 5, 2025

NRPT: బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లె లో వెలసిన శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు (బావోజి) బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఆలయ ఆవరణలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఏర్పాట్లపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు జరిగే ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయంలో బావోజీని దర్శనం చేసుకొని పూజలు చేశారు.

Similar News

News December 16, 2025

విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

image

సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.

News December 16, 2025

ప‌క‌డ్బందీగా 100 రోజుల కార్యాచ‌ర‌ణ: కలెక్టర్

image

ఈ నెల 6న ప్రారంభ‌మైన 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లుపై క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాలో 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు మంచి ఫ‌లితాలు సాధించి, జిల్లాను అగ్ర‌గామిగా నిలిపేందుకు 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లుచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కౌన్సిలింగ్‌తో పాటు మోటివేష‌న్ త‌ర‌గ‌తులు కూడా నిర్వ‌హించాల‌న్నారు.

News December 16, 2025

TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>TRAI<<>>) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు JAN 4వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్ Eng., CS&IT, DS& AI) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023, 2024, 2025లో అర్హత సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.