News August 12, 2025

NRPT: ‘భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’

image

భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల వద్ద పోలీసులను ఏర్పాటు చేయాలని చెప్పారు.

Similar News

News March 6, 2026

శ్రీవారు అవకాశం ఇచ్చారు.. చంద్రబాబు కాదు: ధూళిపాళ్ల

image

టీటీడీ నెయ్యి టెండర్‌ను చంద్రబాబు ఇప్పించలేదని.. నిబంధనలు, సాంకేతిక పరీక్షల అనంతరం సంగం డెయిరీ ఎంపికైందని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంటే శ్రీవారు ఇప్పుడు అవకాశం ఇచ్చారన్నారు. 33 రోజులు తనను జైలులో పెట్టి సంగం సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించినా ఒక్క తప్పూ దొరకలేదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో స్వామి దగ్గర YCP తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

News March 6, 2026

గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

image

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.

News March 6, 2026

పార్వతీపురం: ‘15 లోగా CSC పనులను పూర్తి చేయాలి’

image

జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రతి CSC పని పూర్తి కావడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.