News September 11, 2025
NRPT: మహిళల రక్షణే షి టీమ్ ప్రధాన లక్ష్యం

మహిళలకు రక్షణ కల్పించేందుకే షి టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం తెలిపారు. ఎక్కడ ఆకతాయిల నుంచి మహిళలకు, విద్యార్థినులకు వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు ఎదురైతే నిర్భయంగా షి టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. నేరుగా లేదా 87126 70398 ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
Similar News
News December 6, 2025
భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో ఓపెనర్ డీకాక్ సెంచరీ(106)తో అదరగొట్టారు. కెప్టెన్ బవుమా 48, బ్రెవిస్ 29, బ్రీట్జ్‌కే 24 రన్స్‌తో రాణించగా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ధ్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 271 రన్స్ అవసరం.
News December 6, 2025
రాజమండ్రి: విద్యార్థులకు ముఖ్య గమనిక

నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు రాజమండ్రి క్యాంపస్‌లో నిర్వహిస్తున్నామని వీసీ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో ఈ వివరాలు వెల్లడించారు. ఎం.ఏ., ఎం.కామ్, ఎం.పీ.ఈడీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌కు ఈ అడ్మిషన్స్ ఉంటాయని వీసీ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
News December 6, 2025
రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.


