News December 1, 2025

NRPT: మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పదవి వీడి సర్పంచ్‌గా నామినేషన్

image

బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కూరగాయల రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BRSలో చేరారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా తగిన గౌరవం లభించలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం ధన్వాడ మండల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నీరటి సుజాత రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News February 17, 2026

వరంగల్: నాడు ఒక్క ఓటుతో ఓడి.. నేడు వైస్ ఛైర్మన్‌గా!

image

వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 2020లో ఇదే 5వ వార్డు నుంచి నేతావత్ శిభారాణి రాజేందర్ ఒక్క ఓటుతో బీఆర్ఎస్ తరఫున స్వతంత్ర అభ్యర్థిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా ఈసారి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆమెకు వైస్ ఛైర్మన్ పదవి లభించింది. ఇక తండావాసుల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు.

News February 17, 2026

ప్రకాశం: ‘చిన్నారి మృతి.. విచారణలో జాప్యమెందుకు’

image

సింగరాయకొండ నవోదయకోచింగ్ సెంటర్లో తౌశిక్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కారణమని వారు బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు వార్డెన్‌ను విచారించకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. వార్డెన్‌పైనే తమకు అనుమానం ఉందని వారు బహిరంగంగా చెబుతున్నారు.

News February 17, 2026

300కు 300 మార్కులు

image

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.