News December 2, 2025

NRPT: రెండో రోజు 202 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

image

రెండవ విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సోమవారం నారాయణపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 202 మంది సర్పంచ్ స్థానాలకు, 404 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దామరగిద్ద మండలంలో 56, ధన్వాడ 43, మరికల్ 41, నారాయణపేట మండలంలో 62 మంది నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో మొత్తం 261 సర్పంచ్ స్థానాలకు, 513 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

Similar News

News February 16, 2026

బిల్‌గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్

image

AP: విజయవాడలో ల్యాండ్ అయ్యేందుకు బిల్‌గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయన ఫ్లైట్ ల్యాండైంది. మంత్రులు లోకేశ్, అనిత, సత్యకుమార్, అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన రోడ్డు మార్గంలో వెలగపూడిలోని సచివాలయానికి చేరుకోనున్నారు. విజిబిలిటీ లేక అరగంటపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

News February 16, 2026

ఉమ్మడి నల్గొండలో ‘వరి’ జోరు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఏటికేడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా సాగు గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో వరి పంట సాగు ఊహించని రీతిలో పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది (11,13,472)తో పోలిస్తే ఈ 2026 యాసంగి (12,47,963) సీజన్లో ఏకంగా 1,34,491 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరగడం విశేషం.

News February 16, 2026

శ్రీకాళహస్తిలో భక్తురాలు మృతి: YCP

image

AP: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తురాలు మృతిచెందినట్లు YCP ఆరోపించింది. శివరాత్రి రోజున శివయ్య దర్శనానికి వచ్చిన తిరుపతి(D) కొగిలగొల్లపాలెంకు చెందిన మణెమ్మ గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి అస్వస్థతకు గురైనట్లు చెప్పింది. సమాచారం ఇచ్చినా సకాలంలో 108 వెహికల్ రాలేదని, దీంతో ఆమె మృతిచెందినట్లు ట్వీట్ చేసింది. పండగ రోజు ఆలయాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని, ఈ పాపం ప్రభుత్వానిదే అని మండిపడింది.